Welfare of ESM by Telangana govenment
Submitted by admin on Wed, 18/01/2017 - 05:15
Undefined
WISHES AND THANKS MR RAO HON CM TELANGANA: YOU HAVE IT IN YOU.
సైనికులకూ ‘డబుల్’ అన్న కేసీఆర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేశ భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న సైనిక కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సైనికుల సంక్షేమంపై శాసనసభలో మంగళవారం ఆయన ప్రకటన చేశారు. సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేశామని.. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. సైనికుల సంక్షేమ నిధికి డబ్బులు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. సైనికుల సంక్షేమాన్ని సామాజిక భద్రతగా గుర్తించాలన్నారు. సైనికులు, మాజీ సైనికుల కుటుంబాల మెరుగైన జీవితం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. వారి పిల్లలకు ప్రభుత్వ గురుకులాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకంలో రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తిపన్ను మినహాయింపు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సైనిక పాఠశాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని.. దానిని వరంగల్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీరచక్ర, శౌర్యచక్ర అవార్డులు పొందిన సైనికులకు రూ.75లక్షలు, సేవా మెడల్ పొందిన వారికి రూ.30లక్షలు, సర్వోత్తమ అవార్డు పొందినవారికి రూ.25లక్షల నగదు పురస్కారం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
(SOURCE : http://telugu.oneindia.com/news/telangana/ktr-on-hyderabad-develpoment-192819.html )
(SOURCE : http://telugu.oneindia.com/news/telangana/ktr-on-hyderabad-develpoment-192819.html )
Post Categories: